
కమ్ముకున్న చీకట్లోన కుమ్ముకోచ్చే వెలుతూరమ్మ
కక్ష్య కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాలేవమ్మ
నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వనికిపోవునమ్మ
(జేజమ్మా)
కుంచె పట్టి బొమ్మగీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మ
ఆలనా పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ
నువ్వు పలికేదే తిరుగు లేని వేదం
నువ్వు చేసీదే ఎదురులేని చట్టం
ఓర్పు లోన ధరణి మాతవమ్మ
తీర్పు లోన ధర్మ ముర్తివమ్మా
జేజమ్మ మా యమ్మో
జేజమ్మ ఓయ్ యమ్మో
జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ
జేజమ్మ మా యమ్మో
జేజమ్మ ఓయ్ యమ్మో
జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ
నువ్వు రుద్రరూపం ఎత్తగానే కాలమే దద్దరిల్లి పోయేనమ్మ
రుద్రశక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలై పోయేనమ్మ
బుసగొట్టే కామంధుని కసి తీరగా తోక్కేవమ్మ
పుట్టు గడ్డని ఆదుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మ
మాట నిలుపు కొంటివమ్మ , జేజమ్మ , మళ్ళి జన్మ ఎత్తినావమ్మా
ఎంత దీక్ష పూనినవమ్మ ; గుండెలో నిప్పులే నింపి నావమ్మ
(Background music)
త్యాగమంటే నీదమ్మ నరకమే కొంగులోన ముడిచావమ్మ
(Background music)
నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మ కళ్ళు చెమ్మగిల్లినాయమ్మ
(Background music)
ఈ జారుతున్న రక్తధారాలే నీ తెగువకు ఆరతులు పట్టేనమ్మ
దిక్కులన్ని శూన్యమయ్యే ; వెలుతురంత చీకటయ్యే
ఆశలన్నీ ఇంకిపోయే శ్వాశ మాత్రం మిగిలి పోయే
Wah wah................
ReplyDeleteWhat a Blog Kirthu.....
Amazinggggggggggggaaaaaaaa......